నిన్నటి దాకా సోము వీర్రాజు అనుకుంటే.. ఇప్పుడు మరో నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా టీడీపీపై ఫైరయ్యారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలందరూ ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాజధాని అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకూ రాజధాని నిర్మాణమే ప్రారంభం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ డిజైన్లనే ఖరారు చేయలేదని, ఇచ్చిన సొమ్ముకు లెక్కా పత్రం లేకపోతే కేంద్రం మాత్రం నిధులు ఎలా ఇస్తుందన్నారు. డీటయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వకుండా ఏప్రభుత్వమైనా నిధులను ఇస్తుందా? అని నిలదీశారు. సినిమా డైరెక్టర్లతో డిజైన్లను ఖరారు చేయించడం సరికాదని కన్నా హితవు పలికారు.