Gold Prices Today : బంగారం ఇప్పుడు కొనుగోలు చేయడం కంటే ఆగడం మంచిదా?

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి

Update: 2026-03-29 03:54 GMT

బంగారం ధరలు అందుబాటులోకి రావడానికి ఇంకా కొంత సమయం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో ఎలాంటి సంబంధం లేకుండా ధరలు తగ్గుతుండటంతో కొనుగోలు దారుల్లో కూడా ఆనందం వ్యక్తమవుతుంది. బంగారం అంటే అందరికీ ఇష్టమే. దానిని కొనుగోలు చేయడానికి ప్రతి ఒక్కరూ తమకు వీలున్నప్పుడల్లా ప్రయత్నిస్తారు. కానీ గత ఏడాది నుంచి బంగారం, వెండి ధరల భారీ పెరుగుదలతో ఆ ప్రభావం కొనుగోళ్లపై పడిందని చెప్పాలి.

సాధారణ ప్రక్రియేనని...
ధరలు తగ్గడం అనేది సాధారణ ప్రక్రియ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డిమాండ్ ఉన్నప్పటికీ కొన్ని సార్లు ధరలు తగ్గుతుంటాయని, దానికి అమెరికా డాలర్ బలపడటం మరొక కారణమని చెబుతున్నారు. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రభావంతో క్రూడాయిల్ ధరలు పెరగడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ధరలు ఇంకా తగ్గుతాయేమోనని చాలా మంది ఎదురు చూస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో ఇక అమ్మకాలు మరింత ఊపందుకోనున్నాయని మార్కెట్ నిపుణులతో పాటు జ్యుయలరీ దుకాణాల యజమానులు కూడా అంచనా వేస్తున్నారు.
నేటి ధరలు...
బంగారం, వెండి ధరలు స్థిరంగా లేకపోవడంతో మదుపు దారులు కూడా ఆలోచనలో పడ్డారు. వీటిపై పెట్టుబడి పెట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కొంత ధరలపై ప్రభావం పడుతుంది. ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. అయితే స్వల్పంగానే ధరలు తగ్గాయి. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధరలు 1,35,750 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,48,090 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,30,000 రూపాయలుగా ట్రేడ్ అయింది.




Tags:    

Similar News