సర్కారు ఒకటి తలిస్తే.. కోర్టు మరొకటి తలచింది

Update: 2016-09-30 09:16 GMT

సంపూర్ణ మద్య పాన నిషేధాన్ని అమలు చేయడం అంటే.. రాష్ట్రాలు తమకు దక్కగల ఆదాయాన్ని చాలా త్యాగం చేసి తీసుకునే నిర్ణయం కింద లెక్క. మనదేశంలో గుజరాత్ లో మాత్రమే చాలా కాలంగా నిక్కచ్చిగా మద్యనిషేధం అమలవుతోంది. బీహార్లో ఇటీవల నిషేధం విదించారు. అయితే అరాచకత్వానికి నిలయంగా చెప్పుకునే బీహార్ లో మద్యనిషేధం సాధ్యమేనా..? ఆచరణలో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు గానీ.. సర్కరు వారి ఆలోచనను కోర్టు తప్పుపట్టింది. నిర్ణయం సరే నిర్వహణ చేతకావడం లేదంటూ.. హైకోర్టు నిషేధ ఉత్తర్వులను రద్దు చేయడం విశేషం.

ప్రభుత్వం ఒకటి తలిస్తే హైకోర్టు మరొకటి తలచిందన్నట్లుగా బీహార్ లో మద్యనిషేధం పరిస్థితి తయారైంది. దీనిని చట్టవిరుద్ధమైనదిగా న్యాయస్థానం పేర్కొన్నది. ఈ చట్టం ప్రకారం.. ఎవరి ఇంట్లోనైనా మద్యం సీసా దొరికితే.. ఇంట్లోని మేజర్ లు అందరినీ అరెస్టు చేస్తారు.

ఇలాంటి విపరీత నిబంధనలు ఒక ఎత్తు అయితే.. ఇటీవల రాష్ట్రంలో కల్తీ మద్యం తాగిన దుర్ఘటనలో పలువురు దుర్మరణం చెందడం సంభవించింది. నిషేధాన్ని అమలు చేయడం ప్రభుత్వానికి చేతకావడం లేదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి నేపథ్యంలో హైకోర్టు ఏకంగా మద్యనిషేధ చట్టాన్నే కొట్టేస్తూ తీర్పు ఇవ్వడం విశేషం.

Similar News