ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ కావడం ఇష్టంలేకనే ఎన్నికల బరిలోనుంచి తప్పుకుంటున్నట్లు శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. తాను నైతికతకు కట్టుబడి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానన్నారు. తాను విసిరేసిన ఎమ్మెల్సీ పదవి కోసం టీడీపీ నేతలు పోటీపడి ఏరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఎక్కువగా ఉన్నా తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక దాదాపుగా ఏకగ్రీవమయినట్లే.