వైసీపీ నేతకు ఏపీ శాసనసభ నోటీస్?

Update: 2017-11-21 10:47 GMT

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఏపీ శాసనసభ ప్రివిలేజ్ నోటీస్ జారీ చేసింది. నిన్న అంబటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీలో నెంబర్ వన్ క్రిమినల్ కోడెల శివప్రసాదరావు అని వ్యాఖ్యానించారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ సర్కార్ అంబటి రాంబాబుకు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చింది. ఈ మేరకు శాసనసభలో చీఫ్ విప్ పల్లె రఘునాధరెడ్డి ఏపీ శాసనసభలో ప్రస్తావించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ పట్ల అనుచితంగా మాట్లాడటం సరికాదన్నారు. దీనికి స్పీకర్ కోడెల స్పందిస్తూ శాసనసభ వ్యవహారాల మంత్రితో చర్చించిన తర్వాత దీనిపై చర్యలు తీసుకుంటామని కోడెల తెలిపారు.

Similar News