విద్యుత్ ఉత్పత్తిని తగ్గించిన ఏపీ

Update: 2017-07-21 05:51 GMT

ఏపీలో మిగులు విద్యుత్‌ గణనీయంగా పెరిగిపోవడంతో ఉత్పత్తిని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం గణనీయంగా ఉన్న నేపథ్యంలో దాదాపు 3వేల మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తిని తగ్గించాలని ఆదేశించింది. హిందూజా.,విటిపిఎస్‌లతో పాటు మరికొన్ని ప్లాంట్లలో సంప్రదాయక విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించాలని ఆదేశించింది. ఏపీలో సోలార్‌ ప్లాంట్ల నుంచి భారీగా విద్యుత్‌ అందుబాటులోకి రావడం, కేంద్రం నుంచి కూడా విద్యుత్‌ వస్తుండటంతో థర్మల్‌ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించారు. సమీప భవిష్యత్తులో ఏపీలో సాంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ., థర్మల్ ప్లాంట్లపై భారం మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

Similar News