లోక్ సభలో గందరగోళం

Update: 2018-03-06 06:47 GMT

లోక్ సభలో గందరగోళం ఏర్పడటంతో స్పీకర్ సుమిత్ర మహాజన్ రేపటికి వాయిదా వేశారు. సభ ఈరోజు ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. తిరిగి 12గంటలకు ప్రారంభం అయిన వెంటనే ఏపీ విభజన హామీలు అమలుపర్చాలంటూ టీడీపీ, ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైసీపీ ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగాయి. పెద్దయెత్తున నినాదాలు చేశారు. అలాగే తెలంగాణలో తీర్మానం చేసిన పంపిన రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఆందోళనకు దిగారు. ఇక బ్యాంకుల్లో జరుగుతున్న కుంభకోణాలపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్ నిరసనకు దిగింది. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. గందరగోళం మధ్యనే ప్రభుత్వం కొన్ని బిల్లులను ప్రవేశపెట్టింది.

Similar News