లాటరీ లేదా ముందుగా నోటీసు ఇచ్చిన పార్టీ

Update: 2018-03-26 12:50 GMT

రేపటి సభకు ఎంపీలందరూ హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఎంపీలతో అమరావతి నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సభలో అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశముందని చంద్రబాబు చెప్పారు. అవిశ్వాసంపై చర్చకు టీడీపీ ఎంపీలందరూ పట్టుబట్టాలన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం లాటరీ ద్వారా చర్చ చేపట్టే అవకాశముందని, లేదంటే ముందుగా నోటీసు ఇచ్చిన పార్టీ అవిశ్వాసాన్ని చేపట్టవచ్చునని తెలిపారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, సీపీఎంలు నోటీసులు ఇచ్చాయన్నారు. ఏపీకి జరిగిన అన్యాయం జాతీయ స్థాయిలో విన్పించేలా కృషి చేయాలన్నారు. సభ వేదిక ద్వారా ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షను విన్పించాలన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులకు సంబంధించి అన్నింటికీ యుటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇచ్చామన్నారు. యూసీలు ఇచ్చినందునే తర్వాత నిధులను కేంద్రం విడుదల చేసిందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని, అవిశ్వాసంపై చర్చలో టీడీపీ ఎంపీలు ముందుండాలని చెప్పారు.

Similar News