మంత్రి నారాలోకేష్ తో టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డివిషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. రేవంత్ పార్టీని వీడి వెళ్లిపోవడానికి గల కారణాలను కూడా సండ్ర వెంకట వీరయ్య చినబాబుకు చెప్పినట్లు తెలిసింది. దీపావళి తర్వాత జరిగే టీటీడీపీ సమావేశంలో దీనిపై పూర్తిస్థాయిలో చర్చించి అందరూ ఒక నిర్ణయానికి రావాలని లోకేష్ సండ్ర వెంకట వీరయ్యకు సూచించినట్లు సమాచారం. రేవంత్ వెళ్లినా పార్టీకి ఎటువంటి నష్టం లేదని, పార్టీ కోసం అందరూ కష్టపడి పనిచేయాలని కోరారు లోకేష్. కాని సండ్ర వెంకట వీరయ్య మాత్రం తాను ముందుగా తీసుకున్న అపాయింట్ మేరకే లోకేష్ ను కలిసినట్లు మీడయాకు వివరించారు. అంతేకాదు లోకేష్ ఫోన్లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణతో కూడా రేవంత్ విషయంపై చర్చించినట్లు తెలిసింది. రేవంత్ పార్టీని వీడి వెళ్లటానికి ఏమేం కారణాలున్నాయని చినబాబు ఆరా తీశారు.