Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం..పదమూడు మంది మృతి
. బీహార్ లోని కటిహార్ లో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పదమూడు మంది మరణించారు.
రోడ్డు ప్రమాదం పదమూడు మందిని బలిగొంది. బీహార్ లో జరిగిన ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. బీహార్ లోని కటిహార్ లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీహార్ లో బస్సు, ఒక వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పదమూడు మంది అక్కడికక్కడే మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
జాతరకు వెళ్లి వస్తుండగా...
పోలీసుల కథనం ప్రకారం జాతీయ రహదారి 31పై ఈ ప్రమాదం జరిగింది. గిరిజన వర్గానికి చెందిన వారు ఒక జాతరలో పాల్గొని తిరిగి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు పికప్ ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో పికప్ వ్యాన్ నుజ్జునుజ్జయింది. ఎదురెదురుగా వాహనాలు ఢీకొట్టుకోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. మృతులందరూ పూర్ణియా కు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
మద్యం మత్తులో ఉన్నాడా...
అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అతి వేగమేనని అంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు అప్పటికే అక్కడికి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.