Andhra Pradesh : ఉద్యోగులు కూటమి వైపేనా.. చంద్రబాబు ఆలోచన అదేనా?

కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను దగ్గరకు చేర్చుకుంటుంది

Update: 2026-04-12 04:28 GMT

కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను దగ్గరకు చేర్చుకుంటుంది. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు దూరం పెడితే కూటమి ప్రభుత్వం మాత్రం అక్కున చేర్చుకుంటుంది. ఏ ఎన్నికల్లో అయినా.. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులది కీలక పాత్ర. వారిని అక్కున చేర్చుకోవడంతో గత ప్రభుత్వానికి తమ పాలనకు మధ్య వ్యత్యాసం చూపిస్తే చాలు తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు.. సాధారణ ఎన్నికల్లోనూ గెలుపునకు వారు ముఖ్య భూమిక పోషిస్తారు. నిత్యం ప్రజల్లో తిరిగే ఉద్యోగులు మౌత్ టాక్ తో ప్రభుత్వ పాలన పట్ల పాజిటివ్ టాక్ తేగలరన్నది చంద్రబాబు భావన.

ప్రతి నెల ఒకటో తేదీ...
అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. గతంలో మాదిరిగా ఉద్యోగులను వేధించకుండా, సస్పెన్షన్లు వంటివి చేయకుండా ఎక్కువగా కలెక్టర్లు, ఎస్సీలతో సమీక్షలతోనే చంద్రబాబు సరిపెడుతున్నారు. మరొకవైపు గత ప్రభుత్వంలో జీతం ఎప్పుడు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నుంచి ఒకటో తేదీ నాడు నిధులు జమ అవుతాయన్న నమ్మకాన్ని కలిగించారు. దీంతో పాటు గత ప్రభుత్వంలో బకాయీలు పెట్టిన దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. దీంతో చాలా వరకూ ఉద్యోగులు ఆనందం లో ఉన్నారు.
రిటైర్డ్ అయిన ఉద్యోగులకు...
గత ప్రభుత్వం రిటైర్డ్ అయిన ఉద్యోగులకు చెల్లింపులు జరపలేదు.ప్రావిడెంట్ ఫండ్ కింద 1,847.83 కోట్లు, గ్రాట్యుటీ కింద 3,411.03 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద 1,800 కోట్లు, పోలీసులకు అదనపు సరెండర్ లీవుల కింద 223.47 కోట్లు విడుదల చేశారు. గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ నిమిత్తం 4,793 మంది ఉద్యోగులకు రూ.76 కోట్ల చెల్లింపులు జరిగాయి. మొత్తం 7,059 కోట్ల మేరకు బిల్లుల చెల్లింపు చేపట్టింది. తాజాగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. పెండింగ్‌లో ఉన్న గ్రాట్యూటీ మరియు సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. దాదాపు 2950 కోట్ల చెల్లింపులు విడుదలయ్యాయి.ఈ మొత్తాలు సంబంధిత రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. సర్వీస్‌లో ఉన్న పోలీసు ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో ఉద్యోగ వర్గాలు ప్రభుత్వ అనుకూలంగా మారే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి.


Tags:    

Similar News