Ys Jagan : జగన్ దెబ్బకు చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయినట్లుందిగా?

వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చి ఒకరకంగా అమరావతికి అడ్డంగా నిలబడ్డట్టే కనపడుతుంది.

Update: 2026-04-12 08:55 GMT

వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చి ఒకరకంగా అమరావతికి అడ్డంగా నిలబడ్డట్టే కనపడుతుంది. జగన్ వ్యాఖ్యలు చూసిన వారికి తొలుత జోక్ గా అనుకున్నప్పటికీ రాను రాను దాని వెనక ఉన్న సీరియస్ నెస్ అయింది. అమరావతిలో అన్ని లక్షల కోట్లు.. అదీ చంద్రబాబు హయాంలో ఖర్చు చేయడం జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదు. అంతే కాకుండా అమరావతిలో పెట్టుబడులు రాకుండా ఉండేందుకే జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారన్నది మాత్రం వాస్తవం. ఇదే విషయాన్ని కూటమి నేతలు సయితం అంగీకరిస్తున్నారు. అమరావతిలో కేవలం ప్రభుత్వ భవనాలు వచ్చినంత మాత్రాన భూముల ధరలు పెరగవు. అలాగే ఏ మాత్రం రాజధాని అడుగు ముందుకు పడదు.

మెడికల్ కళాశాలల విషయంలోనూ...
గతంలో జగన్ మెడికల్ కళాశాలలను ప్రయివేటీకరించాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని కూడా ఇదే రకంగా అడ్డుకున్నారు. ఆ విషయంలో అయితే మెడికల్ కళాశాలలకు ఇంత వరకూ టెండర్లు రాకపోవడానికి కారణం జగన్ కాక ఇంకెవరన్న ప్రశ్నకు కూటమి నేతల నుంచి కూడా సమాధానం లేదు. ఎందుకంటే తాను మళ్లీ అధికారంలోకి వస్తే మెడికల్ కళాశాలలన్నింటినీ ప్రభుత్వ పరం చేస్తానని, అవసరమైతే చట్టపరంగా ముందుకు వెళతానని జగన్ హెచ్చరించి టెండర్లు రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో అమరావతి విషయంలోనూ మావిగన్ ప్రతిపాదనతో ముందుకు వచ్చారు.
పెట్టుబడి దారులకు చేరడంతో...
నిజానికి మావిగన్ లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి చేయాలన్నది జగన్ ప్రతిపాదన. మచిలీపట్నాన్ని పక్కన పెడితే సీఆర్డీఏ పరిధిలో ఇవన్నీ ఉన్నాయి. కొత్తగా ఏమీ లేదు. కాకుంటే అమరావతిలో పెట్టుబడులు వస్తే త్వరగా డెవలెప్ అయితే ఆ క్రెడిట్ చంద్రబాబుకు వెళుతుందన్న బాధ, ఆక్రోశంతో కొత్త ప్రతిపాదన తెచ్చాడు. తాను అమరావతికి వ్యతిరేకం కాదంటూనే.. తాను తిరిగి వస్తే చట్టాన్ని ఎందుకు మార్చలేనని ప్రశ్నించి ఇన్వెస్టర్లలో మరింత అనుమానాలను జగన్ లేపగలిగాడు. జగన్ ఒకరకంగా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు ను అడ్డుకుంటూ తన వ్యూహాలతో ముందుకు వెళుతున్నాడు. జగన్ అమరావతి బెదిరింపులు పెట్టుబడి పెట్టేవారి చెవులకు ఎప్పుడో చేరాయి. అది చాలు. అందుకే వైసీపీ నేతల చేత మావిగన్ నామస్మరణ చేయిస్తూ పెట్టుబడులు అమరావతి వైపు రాకుండా అడ్డుకుంటున్నారన్న వాదన ఉంది. ఏతా వాతా నష్టపోయేది మాత్రం.. పాపం భూములిచ్చిన రైతన్నలే.


Tags:    

Similar News