రంగంలోకి దిగిన బార్ అసోసియేషన్

Update: 2018-01-13 13:38 GMT

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ రంగంలోకి దిగింది. మొత్తం ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బృందం చీఫ్ జస్టిస్ తో పాటుగా నలుగురు న్యాయమూర్తులను కలిసి సమస్య పై చర్చిస్తుంది. జడ్జీలతో ప్రధాన న్యాయూమూర్తి మాట్లాడాలని బార్ అసోసియేషన్ కోరింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సీనియర్ జడ్జిలు, చీఫ్ జస్టిస్ విచారించాలని కోరింది. న్యాయూర్తులందరినీ కలసి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని బార్ అసోసియేషన్ ప్రకటించింది.

Similar News