సినిమాల్లో నటించాలని ఆశతో హైదరబాద్ వస్తుంటారు. ఇంట్లో వాళ్లు వద్దని చెప్పినా కూడా వినకుండా హైదరబాద్ కు వస్తుంటారు ఇక్కడికి వచ్చి స్టార్ హీరోలు అవుదామని అనుకుంటారు. కాని ఇక్కడ ఉండే పరిస్దితులు వేరు. తెరమీద కనబడే దృశ్యాలు ఇక్కడ కనబడవు. కేవలం అవి రంగుల ప్రపంచం అని తరువాత తెలుసుకుంటారు. అన్ని తెలుసుకునే సరికి పరువు పోతుంది. దీంతో తిరిగి ఇంటికి వెళ్లలేక ఇక్కడ బతకలేక చాలా మంది పక్క దారులు పడుతుంటారు. అలాంటి దాన్లోంచి చచ్చిన స్టోరీనే ఇది. రెండు సినిమా స్టోరీల కధ ఇది.ఆ యువకుడి పేరు వెంకటేష్. అతను గత పది సంవత్సరాలుగా దర్శకుడు మణిశర్మ దగ్గర పనిచేస్తున్నాడు. మణిశర్మ కార్యాలయంలో అస్టిసెంట్ గా పనిచేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి పోయే హీరోలను చూసి తాను కూడా అలా కావాలని అనుకున్నాడు. కాని అలా కావాలంటే కొంత స్టేటస్ మెయింటెన్ చేయాలని అనుకున్నాడు. ఇందుకు గాను పెద్ద మొత్తంలో డబ్బులు సంపాందించాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా లావిష్ లైఫ్ కు కూడా అలవాటు పడ్డాడు. డబ్బులు లేక పొవడంతో అప్పడప్పుడు మణిశర్మ కార్యాలయంలోనే చిన్న చిన్న దొంగతనాలు చేస్తు వుండే వాడు.
నమ్మకంగా ఉంటున్నాడని...
నమ్మకంగా వుండే వెంకటష్ కు పూర్తిగా కార్యాలయంతో పాటుగా ఇల్లును అప్పగించారు మణిశర్మ. దీంతో వెంకటేష్ మనసులో దొంగ నిద్ర లేచాడు. వెంటనే మణిశర్మ బీరువాలో వుండే డబ్బులతో పాటుగా బంగారం వస్తువులతో ఉడాయించాడు వెంకటేష్. తన ఇంట్లో డబ్బులతో పాటుగా విలువైన వస్తువులు పోయాయని ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి వెంకటేష్ ను పట్టుకున్నారు.ఇదిలా వుంటే.. మరొక కేసులో ఇద్దరు సినిమా పరిశ్రమకు చెందిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.. ఒకరు సినిమాలో అసిస్టెంట్ గా పనిచేస్తారు.. మరొకరు షార్ట్ ఫిల్మ్ లకు ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.. ఇద్దరు ప్రొఫెషనల్ జాబ్ లు చేసుకుంటున్నారు..అయినా వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు.. దీంతో హైదరాబాద్ లోని విలాసవంతమైన కాలనీలు, ధనికులు ఉండే ప్రాంతాల్లో దొంగతనాలు చేశారు.. చివరకు పోలీసులకు చిక్కారు. అరెస్టయిన విక్కీ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ఐదుకు పైగా కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.. నిందితుల నుండి పదమూడులక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు..