ముసలోడు మహాముదురు

Update: 2017-11-22 12:13 GMT

ముసలోడే కాని మహా ముదురు... స్కూలు పిల్లలే టార్గెట్ గా చేసుకుని చాక్లెట్స్ అశ చూపి అత్యాచార యత్నం చేస్తున్న 85 ఏళ్ల ముసలోడు... రైల్వే రిటైర్డ్ ఉద్యోగి. ఇతన్ని పట్టుకుని పోలీసులు కటకటల వెనక్కు నెట్టారు.హైదరాబాద్ కుషాయగూడ పోలీస్ స్టేషన్ పరిదిలోని కాప్రా సర్కిల్ ప్రథమపురి కాలనీలో నివాసముంటున్న సత్యనారాయణ (85 ) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి . రైల్వే లో రిటైర్మెమెంట్ తీసుకోవడంతో సత్యనారాయణ ఇంట్లోనే ఖాళీగా ఉండే వాడు. అతని కొడుకు అమెరికా లో ఉంటాడు. దీంతో కొడుకు దగ్గర నుంచి అమెరికా చాక్లెట్స్ తెప్పించుకునేవాడు. ఆ చాక్లెట్లను అశ చూపి స్కూల్ పిల్లల్నే టార్గెట్ చేసి అత్యాచార యత్నానికి పాల్పడుతున్నాడు.గత ఆరు నెలల నుంచి 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయలను ఆరుగురికి చాక్లెట్స్ ఇచ్చి అత్యాచారయత్నం చేశాడు.

చిన్న పిల్లలే టార్గెట్ గా...

రాచ కోండ పరిధి లోని షీ టీం మహిళల పై జరుగుతున్న అత్యాచారయత్నాలపై అవగాహన సదస్సును ఈ నెల 16 న కుషాయగూడలోని ఓ స్కూల్ లో ఏర్పాటు చేశారు. దీంతో కాప్రా హైస్కూల్ లో చదువుతున్న స్కూల్ విద్యార్దులు ముసలోడి చాక్లెట్స్ పేరుతో అత్యచారయత్నం చేస్తున్నట్లు షీం టీం దృష్టికి తీసుకెళ్లారు.ఇప్పటికే ఆరుగురు విద్యార్థినులను చాక్లెట్స్ ఇచ్చి అత్యచారం చేశాడన్నారు.. దీంతో షీం టీం బృందం విద్యార్దుల తల్లిదండ్రులనుంచి ఫిర్యాదు స్వీకరించింది. కుషాయగూడ పోలీసులు సత్యనారాయణను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.. కాని ముసలోడు మాత్రం తాను చాలామంది అమ్మాయిలకు చాక్లెట్స్ ఇచ్చేవాడనని, అయితే అత్యాచారం చేయలేదని తప్పుచేశానని చెబుతున్నాడు.

Similar News