మావోల ఘాతుకం

Update: 2018-03-19 08:25 GMT

బీజాపూర్ జిల్లా తుంనార్ -- కోయిట్ పల్లి మధ్య రోడ్ నిర్మాణంలో ఉన్న నాలుగు వాహనాలను మావోయిస్టులు తగులపెట్టారు. రోడ్ కాంట్రాక్టర్ విశాల్ కుమారుడిని హత్యచే చేశారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. తుంనార్ కోయిట్ పల్లి మధ్య రోడ్ నిర్మాణంలో ఉన్న 6 వాహనాలను తగులబెట్టడంతో పాటు రోడ్ కాంట్రాక్టర్ కొడుకు విశాల్ కుమారుడిని హత్యచేసి రోడ్డు పైన పడేసారు.అయితే గత నెలలో రోడ్డు పనులు ఆపాలని మావోయిస్టులు హెచ్చరించారు. గత నెలలో బస్తర్ జిల్లా మారుడూమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధానమంత్రి సడక్ నిర్మాణ్ యోజనలో భాగంగా రోడ్డు నిర్మాణంలో వున్న 10 ట్రాక్టర్లను,మరికొన్ని ఇతర వాహనాలను తగులబెట్టారు, మొదకాపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భటపల్లి సంకనపల్లి రహదారి మధ్యలో జరుగుతున్న రోడ్డు నిర్మాణంలో పని చేస్తున్న ఒక మిక్సర్, 9 ట్రాక్టర్లను తగులబెట్టారు .ఈ ఘటనలో 100మందికి పైగా మావోయిస్టులు పూర్తి స్థాయి వెపన్స్ తో పాల్గొన్నట్లు సమాచారం, అయితే గత నెలలో బస్తర్ జిల్లాలో సుమారు 20 కి పైగా వాహనాలను తగలబెట్టడం తోపాటు రోడ్డు పనులు చేసే కార్మికులను కొట్టి, పనిని కొనసాగిస్తే చంపేస్తామని బెదిరించారు. అంతే గాక సుకుమా జిల్లా ఎర్రబోరు పరిధిలోని NH30 వద్ద రోడ్ నిర్మాణంలో ఉన్న టిప్పర్ వాహనాన్ని తీసుకెళ్లి తగలబెట్టి రోడ్డు నిర్మాణం ఆపేయాలని డిమాండ్ చేయడం చేశారు. అయినా మరోసారి రోడ్డు నిర్మాణం కొనసాగడంతో మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారని సమాచారం.

Similar News