జూబ్లీ హిల్స్ లో జరిగిన రోడ్ ప్రమాదం లో బాసర పూజారి మృతి చెందాడు. మద్యం మత్తు లో డ్రైవ్ చేయడం తో కార్ అదుపు తప్పి పూజారి విశ్వజీత్ మృతి చెందాడు. ఈ పూజారిని గతం లో ప్రభుత్వం సస్పెండ్ చేసేంది. ఇరవై రోజుల క్రితమే సస్పెన్షన్ తొలగించింది. విశ్వజిత్ బాసర ఉత్సవ విగ్రహ తరలించారన్న ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ ను ఇటీవలే తొలగించారు. అయితే నిన్న రాత్రి స్నేహితులతో కలసి ఫుల్లుగా మద్యం సేవించి కారులో వస్తుండగా డివైడర్ ను ఢీకొని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విశ్వజిత్ అక్కడిక్కడే మృతి చెందాడు. విశ్వజిత్ స్నేహితులు వివేక్, రాజు, పృథ్వీకి గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మణికొండలో జరిగిన ఒక పార్టీకి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.