మంత్రి ఆది తూచ్... అన్నారే...!

Update: 2018-02-15 14:14 GMT

వైసీపీ ఎంపీలకంటే ముందే మార్చి 5వ తేదీన టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని జగన్ సవాల్ కు ప్రతిస్పందించిన మంత్రి ఆదినారాయణరెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. కేంద్రంలో టీడీపీ రాజీనామాలు తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఇది పార్టీ నిర్ణయం కాదని తెలిపారు. అయితే మార్చి 5వ తేదీన ఎంపీలు రాజీనామాలు చేస్తారని చెప్పడం పార్టీ నిర్ణయం కాదని మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ అధినేత సూచన మేరకే మంత్రి ఆదినారాయణరెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేశారంటున్నారు. అయితే ప్రజాభిప్రాయం మేరకు వైసీపీ కంటే ముందుగానే తమ పార్టీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే బాగుంటుందని తన సూచనగా ఆయన చెప్పుకొచ్చారు.

Similar News