బ్రహ్మోత్సవ వైభవం సమాప్తం

Update: 2016-10-12 01:00 GMT

శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు బ్రహ్మాండనాయకుడు తిరు వేంకటనాధుని బ్రహ్మోత్సవ సంరంభం ముగిసింది. మంగళవారం ఉదయం స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడు సుదర్శన చక్రత్తాళ్వార్ వారిక వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా చక్రస్నానం చేయించారు. మంగళవారం సాయంత్రం ఆలయంలో ధ్వజావరోహణం చేయించడంతో బ్రహ్మోత్సవ వైభవం ముగిసినట్లయింది.

తిరుమల వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏటా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. అధికమాసం వచ్చే కొన్ని సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు ఏడాదిలో రెండేసి మార్లు కూడా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు తొలినాడు ధ్వజావరోహణంతో ప్రారంభమై పెద్దశేషవాహనం జరుగుతుంది. తర్వాత ఏడు రోజుల పాటూ ప్రతిరోజూ కనీసం రెండు వాహన సేవలు ఉంటాయి. ఉదయం ఒకటి రాత్రి ఒకటి వాహన సేవలను నిర్వహించారు. కేవలం వాహన సేవలే కాకుండా స్వామి వారికి ఊంజల్ సేవ, స్నపన తిరుమంజనం కార్యక్రమాలను కూడా నిర్వహించారు. 9వ రోజున చక్రస్నానం మరియు ధ్వజావరోహణంతో ఉత్సవాలను ముగించారు.

ప్రపంచంలోనే కనీవినీ ఎరుగనంత వైభవోపేతంగా జరిగే ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి లక్షలాది మంది భక్తులు విచ్చేశారు. ఎలాంటి ఇబ్బందులు , అవాంతరాలు లేకుండా మొత్తం బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

Similar News