బిగ్ బి కి ఆ అర్హత ఉందా: మహారాష్ట్ర కాంగ్రెస్

Update: 2016-04-09 22:56 GMT

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు ప్రభుత్వ పధకాల అంబాసిడర్ గా కొనసాగే అర్హత వుందా? అని ప్రశించింది మహారాష్ట్ర కాంగ్రెస్. పనామా పేపర్స్ బ్లాక్ లిస్టు లో అమితాబ్ పేరు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత రాధాకృష్ణ పాటిల్ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. పనామా పత్రాలలో అమితాబ్ పేరు ప్రస్తావనకు వచ్చిందని, ఆయన నాలుగు విదేశీ కంపెనీలలో డైరెక్టర్ గా వున్నారని, అలాంటి వ్యక్తిని ప్రభుత్వ అంబాసిడర్ గా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారాయన. దీనిపై బిజెపి సమాధనం ఇస్తూ.. ఈ అంశంలో కేంద్రం విచారణకు అదేశించిందని, ఆయన తప్పు చేస్తే శిక్షార్హుడు అవుతారని, ప్రస్తుతానికి అది ఆరోపనేనని, ఆరోపణను ఆదరంగా చేసుకొని ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పుకొచ్చింది. ఇరు వాదనలు విన్న స్పీకర్.. పాటిల్ ఇచ్చిన తీర్మానాన్ని తోసిపుచ్చారు.

Similar News