బాహుబలి కలెక్షన్లంత నిధులు కూడా ఏపీకి ఇవ్వలేదే...!

Update: 2018-02-07 13:05 GMT

వైసీపీతో కలుద్దామనుకుంటున్నారేమో... అది అవినీతి పార్టీ.. కేసుల నుంచి బయట పడటానికే వారు మీకు మద్దతిస్తున్నారు. మిత్రపక్షంగా కొనసాగాంటే విభజన హామీలు అమలు చేయండని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గట్టిగా మాట్లాడారు.లోక్ సభలో ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. తాము మిత్రపక్షంగా ఉండాలో లేదో మీరే తేల్చుకోవాలంటూ బీజేపీకి పార్లమెంటు సాక్షిగా జయదేవ్ కోరారు. ఏపీకి ఇచ్చినహామీలు ఇంతవరకూ నెరవేర్చలేదని, నిధులు కూడా విడుదల చేయాలేదన్నారు. తెలుగు సినిమా బాహుబలి చేసిన వసూళ్ల మొత్తం కూడా తమకు కేటాయింపులు జరగలేదని గల్లా జయదేవ్ చమత్కరించారు. విభజన సమయంలో ఎన్నో హామీలుఇచ్చారని, ఎన్నికలు సమయంలో ఎన్నో వాగ్దానాలు చేశారని, కాని నాలుగేళ్లవుతున్నా ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలయమయిందన్నారు. ఇలాగైతే తమ దారి తాము చూసుకుంటామన్నారు గల్లా జయదేవ్.

Similar News