కుటుంబ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. సొతింల్లు కాస్తా పక్కవారి కబ్జాలో ఉంది..కుటుంబ పెద్దంటూ ఎవరూ లేరు... అలాగని సపోర్ట్ కూడా ఎవరూ లేరు. ఓవైపు నమ్మిన వ్యక్తితో ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన, అమ్మాయి చైతన్య రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన స౦ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది .చెరుకుపల్లి కాలానికి చెందిన జయలక్ష్మి ప్రభాకర్ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు ఒక బాబు. చిన్న పిల్లలుగా ఉన్నపుడే భర్త ప్రభాకర్ చనిపోవటంతో జయలక్ష్మి కష్టపడి పిల్లలను చదివిస్తోంది. పెద్ద కూతురు వివాహంకాగాచ రెండో అమ్మాయి చైతన్య చెన్నై లో ఎంటెక్ చదువుతుంది. కాగా చైతన్యకు చెన్నై వెల్లూర్ కు చెందిన కిశోర్ తో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇటీవల వారిరువురి మధ్య మనస్పర్థలు వచ్చాయి దీనికి తోడు తమ ఇంటిని మరో వ్యక్తి కబ్జా చేయడం, ఒంటరి తల్లి ఎలాబతుకుతుందో అనే దిగులు, ఆర్థిక సమస్యలు తోడు కావడంతో సూసైడ్ నాట్ రాసి రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి౦ది చైతన్య. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గా౦ధీ ఆసుపత్రికి తరలించారు.