పాతబస్తీలో దారుణం..క్లినిక్ లోకి చొరబడి డాక్టర్ హత్య..

Update: 2017-03-22 01:59 GMT

పాతబస్తీలొ మరొక దారుణం చొటు చేసుకుంది.. ఒక క్లినిక్ లోకి కొంత మంది దుండగులు చొరబడి డాక్టర్ ను అతికిరాతకంగా హాత్య చేశారు..అందరు చూస్తుండగానే ఈ హాత్య జరిగింది. అత్యంత్య రద్దీ గా వుండే హూమయన్ నగర్ ప్రాంతంలో మిరాజ్ క్లినిక్ వుంది. ఈ క్లినిక్ డాక్టర్ మిరాజ్ నడుపుతుంటారు. క్యార్డియాలాజి డాక్టర్ అయిన ఈ మిరాజ్ ప్రతి రొజు ఉదయం మరియు సాయంత్రం ఇక్కడ క్లినిక్ నడుపుతుంటారు..క్యార్డియాలజిస్టు గా మంచి పేరు వుంది మిరాజ్కి..ఈ నేపధ్యంలో రోజులో రెండు సమయాల్లో క్లినిక్ లో బిజిగా వుంటారు..సాయంత్రం నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా మిరాజ్ క్లినిక్ లోనే వుంటారు..పది గంటల సమయంలో పేషెంట్లు బాగా తగ్గిపొయారు. కొద్దిగా రిలాక్స్ అయ్యాడు మిరాజ్ ..ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగ క్లినిక్ లోకి వచ్చారు..వచ్చినవారు ఏకంగా మిరాజ్ గదిలోకి చొరబడ్డారు. ఇద్దరు కలిసి కత్తులతో మిరాజ్ పైన విచక్షణా రహితంగా పొడిచి చంపారు. తనను రక్షించాలంటూ డాక్టర్ మిరాజ్ క్లినక్ లోని వరండాలోకి పరుగెత్తికుంటూ వచ్చారు. అయితే వచ్చిన దుండగులు వెంట పడి మిరాజ్ ను అతికిరాతకంగా హత్యచేశారు.. మిరాజ్ చనిపొయారని రూడీ చేసుకున్న తరువాత ఇద్దరు దుండుగులు అక్కడి నుంచి పారిపొయారు.. అయితే హాత్య జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుండగుల కొసం గాలింపు చర్యలను చెపట్టిన్నారు.

ఇదిలా వుంటే మిరాజ్ ను ఎవరు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న దానిపైన పోలీసలు సమగ్రంగా విచారణ చేస్తున్నారు. ప్రధానంగా కుటుంబ తగదాలు కారణంగా నే ఈ హత్య జరిగి వుంటుందని పోలీసులు అనూమానం వ్యక్తం చేస్తున్నారు. మిరాజ్కు  భార్య తరుపు వాళ్లుతో గొడవలు వున్నాయి, ఇటివల కాలంలో ఒక భార్యను వదిలి పెట్టి మరొకరిని వివాహాం చేసుకున్నాడు.ఈ కారణంతోనే మిరాజ్ ను హాత్య చేసి వుండవచ్చునని అనూమానం. మిరాజ్ బావమరిదిని ఇప్పటికేపోలసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం..హత్య జరిగిన వెంటనే అక్కడే వున్న కొంత మంది వ్యక్తులు మిరాజ్ బావ మరిది ఇక్కడికి వచ్చాడని చెప్పడంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

Similar News