జాయింట్ ఫ్యాక్ట్ ఫైండిండ్ కమిటీ సక్సెస్ అవుతుందని మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. టీడీపీకి, వైసీపికి నిజంగా ఏపీ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలన్నారు. రాజీనామాలతో కేంద్ర ప్రభుత్వానికి వచ్చేనష్టమేదీ లేదన్నారు. రాజీనామాల కంటే అవిశ్వాసమే బెటరన్నారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చలు ఒక్కటే మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సమాచారం ఇవ్వడం ముఖ్యమన్నారు. ఒక రాజకీయపార్టీ నిజాలను వెలికితీయడానికి ప్రయత్నించడం ఇదే తొలిసారి అని, ఇది చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు ఉండవల్లి.