పద్మావత్ సినిమా సూపర్ అట....!

Update: 2018-01-19 02:15 GMT

సినిమా పూర్తి అయ్యి కర్ణి సేనా, రాజపుత్ ల హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాదిన వెల్లువెత్తిన నిరసనల హోరు తో విడుదల జరుగుతుందా లేదా అనుకున్న పద్మావత్ చిత్రానికి కస్టాలు తీర్చింది సుప్రీం కోర్ట్. సుప్రీం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఈ చిత్రంపై నిషేధం విధించిన నాలుగు బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాల తీరు చీవాట్లు పెట్టారు. తక్షణం వారు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని సుప్రీం స్పష్టం చేసింది. దాంతో సందేహంలో పడిన సంజయ్ బన్సాలి చిత్రానికి చీకట్లు తొలగిపోయాయి.

సినిమా సూపర్ అన్న పండిట్ రవిశంకర్ ...

ఈ చిత్రాన్ని నిర్మించిన సంజయ్ తో కలిసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ పండిట్ రవిశంకర్ తిలకించారు. సినిమా అద్భుతంగా తీశారని సంజయ్ పై ప్రశంసల జల్లు కురిపించారు రవిశంకర్. ఈ చిత్రం దేశవాసులందరిని అలరిస్తుందని సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు ఆయన.

విడుదల కాకుండా అడ్డుపడతాం : కర్ణి సేన

పద్మావత్ చిత్రం ప్రదర్శించే థియేటర్లు అడ్డుకుంటామని మరోసారి కర్ణిసేనా హెచ్చరించింది. చిత్ర నిర్మాణం నుంచి విధ్వంసానికి దిగుతూ వచ్చిన కర్ణిసేన తాజాగా అదే స్టాండ్ పై నిలబడింది. సుప్రీం కోర్ట్ చిత్ర విడుదలకు దేశవ్యాప్త అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చాకా కర్ణిసేనా ఇలా చెప్పడంతో సర్వత్రా ఈనెల 25 న ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి అన్న ఆసక్తి ఆందోళన అందరిలో మొదలైంది. ఈ చిత్ర ప్రదర్శన నిషేధించిన బిజెపి పాలిత రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్,రాజస్థాన్, హర్యానా ఇప్పడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయన్నది చర్చనీయాంశం అయ్యింది.

Similar News