థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ నటుడికి షాక్

Update: 2017-06-29 13:24 GMT

ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ తన భార్య శ్రీలక్ష్మికి భరణం కింద నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు తాజాగా ఆదేశించింది. పృధ్వీరాజ్ విజయవాడకు చెందిన శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు, కూతురు. అయితే సినిమాల్లో బిజీ అయిన పృధ్వీరాజ్ భార్యను బయటకు పంపించివేశారు. దీంతో పృధ్వీరాజ్ భార్య విజయవాడ కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు భరణం కింద నెలకు 8 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. సమన్లు పంపినా పృధ్వీరాజ్ కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ తీర్పు చెప్పింది. అయితే పృధ్వీరాజ్ ప్రస్తుతం సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్నారు.

ఎవరో నడిపిస్తున్నారు.....

ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ తనయుడు సాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, తన తల్లి, తండ్రి మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. కుటుంబ గొడవలు కోర్టు వరకు వెళ్తాయని అనుకోలేదని, తన తల్లి వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారని సాయి శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. తనను, తన చెల్లెలని తన తండ్రి పృథ్వీరాజ్ బాగా చూసుకునేవారని చెప్పారు. కాగా, పృథ్వీరాజ్ తన భార్య శ్రీలక్ష్మిని గత ఏడాది ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. రాజీకి యత్నించినా భర్త పట్టించుకోకపోవడంతో శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. దీంతో,ఆమెకు ప్రతినెలా భరణం కింద రూ.8 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది...

Similar News