గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. కష్టపడుతూ నిదానంగా ఆడుతూ అలవోకగా ఎల్.ఎస్.జి తమ ముందున్న అతి చిన్న లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా గుజరాత్ టైటాన్స్ బౌన్స్ బ్యాక్ అయినట్లే. ఇప్పటికే రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో పరవాలేదనిపించింది. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆరంభంలో మంచి వేగం కనిపించినా, మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో జట్టు రన్‌రేట్ తగ్గింది. ఐడెన్ మార్క్రమ్30 పరుగులు చేయగా, కెప్టెన్ రిషబ్ పంత్ వేగంగా 18 పరుగులు జోడించాడు. అయితే మధ్యలో భాగస్వామ్యాలు నిలవకపోవడంతో ఎల్‌ఎస్‌జీ ఒత్తిడిలో పడింది. బౌలింగ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా రాణించాడు. నాలుగు వికెట్లు తీసి లక్నో సూపర్ జెయింట్స్ ని కట్టడి చేశాడు. మధ్య, డెత్ ఓవర్లలో భాగస్వామ్యాలను చెదరగొట్టి ఒత్తిడి పెంచాడు. మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మకూడావికెట్లు సాధించారు.
టైటాన్స్ బౌలింగ్ పరంగా...
చివర్లో జార్జ్ లిండే చిన్న ఇన్నింగ్స్ ఆడగా, లోయర్ ఆర్డర్‌లో మహ్మద్ షమి, అవేశ్ ఖాన్ లు వేగంగా పరుగులు జోడించారు. దీంతో ఎల్‌ఎస్‌జీ గౌరవప్రదమైన స్కోరుకు చేరుకుంది. అయితే గుజరాత్ టైటాన్స్ క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో పరుగులు అదుపులోనే ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ విజయం సాధించాలంటే 165 పరుగులు చేయాలి. రెండో ఇన్నింగ్స్ పోటీగా ఉండే అవకాశముంది. అయితే గుజరాత్ టైటాన్స్ నిదానంగా ఆడుతూ లక్ష్యాన్ని ఛేదించింది.
ఓపెనర్లుగా దిగిన...
ఓపెనర్లుగా దిగిన శుభమన్ గిల్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. శుభమన్ గిల్ 56 పరుగులు వద్ద అవుట్ అయ్యాడు. బట్లర్ 60 పరుగులు చేసి అవుటయ్యాడు. సాయి సుదర్శన్ మాత్రం 15 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ నలభై ఐదు పరుగుల వద్ద అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్ కూడా బంతి చేతికి అందినప్పుడు బాదుతూ ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు తీశాడు. 29 బంతుల్లోనే బట్లర్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. గిల్ అవుటయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చాడు. బట్లర్ అవుటయిన తర్వాత టెవాటియా క్రీజులోకి వచ్చాుడు.లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు ఎంత శ్రమించినా చివరకు ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. వాషింగ్టన్ సుందర్ టెన్షన్ లో ఉన్న మ్యాచ్ ను గెలిపించాడు.