IPL 2026: తేరుకోని ముంబయి.. పట్టుకోల్పోని బెంగళూరు

ముంబయి ఇండియన్స్ తేరుకోలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పట్టు కోల్పోలేదు

Update: 2026-04-13 02:34 GMT

ముంబయి ఇండియన్స్ తేరుకోలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పట్టు కోల్పోలేదు. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబయి ఇండియన్స్ పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అసలు ఎక్కడా తగ్గలేదు. ముగ్గురు వరసగా హాఫ్ సెంచరీలు చేసి భారీ స్కోరు నమోదు చేసి ముంబయి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఇరవై ఓవర్లకు 240 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పద్దెనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది.

రికార్డు స్థాయిలో పరుగులు...
ముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇరవై ఓవర్లకు 240 పరుగులు చేసింది. ఓపెనర్లుగా దిగిన సాల్ట్ 78 పరుగులు చేయగా, విరాట్ కోహ్లి యాభై పరుగులు చేసి అవుటయ్యారు. కెప్టెన్ రజిత్ పాటిదార్ 53 పరుగులు చేశాడు. చివరలో టిమ్ డేవిడ్ మెపు వేగంతో పరుగులు చేయగా భారీ స్కోరును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ముగ్గురు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. మరొకవైపు ముంబయి బౌలర్లలో హార్ధిక్ పాండ్యా, శాంటర్న్, శార్దూల్ ఠాకుర్, బౌల్ట్ లు తలో ఒక వికెట్ తీసినా అప్పటికే భారీ స్కోరు నమోదయింది.
బలంగా పోరాడినా...
అనంతరం లక్ష్య చేధనలో ముంబై బలంగా పోరాడింది.షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్అజేయంగా 71 పరుగులు చేయగా, హార్ధిక్ పాండ్యా వేగంగా 40 పరుగులు సాధించాడు. అయినా జట్టు 5 వికెట్లకు 222 పరుగులకే పరిమితమైంది. ముఖ్య సమయంలో బెంగళూరు బౌలర్లు నియంత్రణ చూపారు. సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా కీలక వికెట్లు తీశారు. చివరి ఓవర్లలో ముంబై దాడిని అడ్డుకుని జట్టుకు విజయం అందించారు. . రూథర్​ఫోర్డ్ 71 మెరుపులు సరిపోలేదు. హార్దిక్ పాండ్య 40, రికెల్​టన్ 37 ఫర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ 2, రసిక్ ధర్, డఫీ, కృనాల్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ దెబ్బకు ముంబయి కుదేలయింది.


Tags:    

Similar News