జైట్లీ మళ్లీ..మళ్లీ....!

Update: 2018-02-09 13:41 GMT

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ అధిక ఆదాయాన్ని పొందిందని, ఏపీ నష్టపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ కోల్పోయిన లోటు బడ్జెట్ ను భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఆయన రాజ్యసభలో బడ్జెట్ పై చర్చలో మాట్లాడారు. వివిధ మంత్రిత్వ శాఖలు సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. అలాగే వివిధ శాఖలతో చర్చలు జరుపుతున్నామన్నారు. పోలవరానికి నాబార్డు ద్వారా నిధులు ఇస్తున్నామని తెలిపారు. విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తున్నామన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించమన్నారు. 2014-15 సంవత్సరానికి 3,979 కోట్ల సాయం చేశామన్నారు. విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్, దుగరాజు పట్నం ఓడరేవుల విషయంపై చర్చిస్తున్నామని చెప్పారు. విశాఖ-చెన్నై ఇండ్రస్ట్రియల్ కారిడార్ పై దృష్టిపెట్టామన్నారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సూచనల మేరకు టీడీపీ సభ్యులు తమ నిరసనను విరమించి తమ స్థానాల్లో కూర్చున్నారు. అయితే జైట్లీ నిన్న లోక్ సభలోచెప్పిందే మళ్లీ చెప్పారు. కొత్తగా చెప్పిందేమీ లేదని మరోసారి స్పష్టమయింది. ఏపీ ఆందోళనకు సంబంధించి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఏపీ ఎంపీలు డీలా పడ్డారు.

Similar News