అవిశ్వాసం పెట్టగానే సరిపోదని, తమ సభ్యులు వెల్ లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఒత్తిడి వల్లనే టీడీపీ లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టిందని అభిప్రాయపడ్డారు. ఓటింగ్ విషయంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్నారని కూడా ఉండవల్లి చెప్పారు. కేంద్రంపై అవిశ్వాసం రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు పెట్టడం మంచి పరిణామంగా ఉండవల్లి చెప్పారు. చంద్రబాబు తన సత్తా ఏంటో ఇప్పుడు చూపాలని, తన పలుకుబడిని ఉపయోగించుకోవాలని కోరారు.