Bus Accident : మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు దగ్దం.. పన్నెండు మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు మంటల్లో దగ్దం కావడంతో పన్నెండు మంది సజీవ దహనమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు మంటల్లో దగ్దం కావడంతో పన్నెండు మంది సజీవ దహనమయ్యారు. రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా, పది మంది సజీవదహనం అయ్యారు. పలకల క్వారీల వద్ద టిప్పర్- ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. బస్సుతో పాటు టిప్పర్‌లోనూ మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని పన్నెండు మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాలపాలయ్యారు.
హైదరాబాద్ నుంచి పామూరు...
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రమాదంతో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. గురువారం ఉదయం 6-6.30 గంటల మధ్య ఈ ఘోరం జరిగింది. ఘటనాస్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పలకల క్వారీల బస్సు మలుపు తిరుగుతుండగా టిప్పర్ ఢీకొట్టినట్లు సమాచారం. టిప్పర్ అతివేగమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో ముప్ఫయి నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మృతిచెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ముందు భాగంలో ఉన్న...
బస్సు ముందు భాగంలో ఉన్న సుమారు పది మంది ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో కనిగిరి ప్రాంతానికి చెందిన వారు ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు.మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు.
సమగ్ర విచారణ జరపాలని...
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో ఇరవై మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల సంఖ్యపెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గాయాలపాలయిన వారిని మార్కాపురంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.