బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక బస్సు నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 27 మంది మృత్యువాత పడ్డారు. రాజస్థాన్ లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రాజస్థాన్ లోని సవాయ్ మధోపూర్ లోని దుబి వద్ద ఒక ప్రయివేటు బస్సు బనస్ నదిలో పడిపోయింది. వీరంతా మధ్యప్రదేశ్ కు చెందిన వారు. రాజస్థాన్ లోని రామ్ దేవ్రా ప్రాంతానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఒక వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు.