కాకినాడలో వైసీపీ నేతపై టీడీపీ లీడర్ దాడి

Update: 2017-11-23 04:48 GMT

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన కార్పొరేటర్ సత్యనారాయణపై తెలుగుదేశం పార్టీ నేత దాడికి దిగారు. దీంతో సత్యనారాయణకు తీవ్రగాయాలయ్యాయి. వైసీపీ నేత సత్యనారాయణరావుపై దాడి చేసింది తెలుగుదేశం పార్టీ నేతగానే కాకుండా జన్మభూమి కమిటీ సభ్యుడు కూడా. సత్యనారాయణపై దాడి జరిగిందని తెలియడంతో వైసీపీ కార్కకర్తలంతో కోపోద్రిక్తులయ్యారు. దీంతో టెన్షన్ నెలకొంది. పోలీసులు అప్రమత్తమై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Similar News