కాంగ్రెస్ చేసిన అవమానాల వల్లనే తెలుగుదేశం పార్టీ పుట్టిందని ప్రధాని మోడీ అన్నారు. పార్లమెంటులో ఆయన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. అయినా మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే తర్వాత తెలుగుదేశం సభ్యులు తమ స్థానాల్లో కూర్చున్నారు. రాజీవ్ గాంధీ హయాంలోనే ఏపీ ముఖ్యమంత్రికి అవమానం జరిగిందన్నారు. అంజయ్య, సంజీవరెడ్డి లాంటి వారిని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రాష్ట్రాన్ని మోసం చేసింది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. వాజపేయి హయాంలో రాష్ట్రాల విభజన హేతుబద్ధంగా జరిగిందన్నారు. దేశ విభజన పాపం కూడా కాంగ్రెస్ దే నన్నారు. కాంగ్రెస్ చేసిన పాపాలను కడిగేయడానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. తెలంగాణ రాష్ట్రంఏర్పడాలని అప్పుడూ, ఇప్పుడూ కోరుకున్నామన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కన్పించదని ఎద్దేవా చేశారు. వల్లభాయ్ పటేల్ ప్రధాని అయిఉండి ఉంటే కాశ్మీర్ సమస్య తలెత్తేదే కాదన్నారు. అయితే ప్రధాని ప్రసంగం ప్రారంభంకాగానే టీడీపీ ఎంపీలు తమ సీట్లలో తాము కూర్చున్నారు. వైసీపీ ఎంపీలు మాత్రం వాకౌట్ చేశారు.