కాంగ్రెస్ కొంపముంచింది ఖచ్చితంగా ఇదే

Update: 2017-12-18 15:15 GMT

గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంపముంచింది నోటా మూలంగానే. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గతంలో కంటే బాగా పుంజుకుంది. దాదాపు 80 స్థానాలను దక్కించుకుంది. అంటే మరో 12 స్థానాలను దక్కించుకుంటే అధికారంలోకి వచ్చేది. కాని గుజరాతీయులు ఎక్కువగా నోటా కే ఓట్లు వేయడం ఆ పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టిందంటున్నారు విశ్లేషకులు. గుజరాత్ ఎన్నికల్లో నోటాకు 5,40,566 ఓట్లు వచ్చాయి. అంటే 1.8 శాతం ఓట్లు నోటాకే పడ్డాయి. అలాగే పదిహేను నియోజకవర్గాల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. దీన్ని బట్టి చూస్తే నోటా కాంగ్రెస్ కొంపముంచిందనే చెప్పకతప్పదు.

Similar News