ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఇంట్లో అవినీతి నిరోదక శాఖ అధికారులు బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్ లోగల ఆయన ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో నాలుగు ప్రాంతాల్లో, కరీంనగర్‌లోని మూడు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. అంతేగాక శ్రీనివాసరెడ్డి బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో మెదక్ లో మూడున్నర ఎకరాలు ,కరీంనగర్ లో 12 ఎకరాలు ,60 తులాల బంగారం ,2 కిలోల వెండి ,విదేశీ కరెన్సీ ఉన్నట్లు ఏసీపీ అధికారులు కనుగొన్నారు. కరీంనగర్ లో ఒక ఇల్లు ,సుచిత్ర లో ఒక ఇల్లు, కోటిన్నర రూపాయల మేరకు అక్రమ ఆస్తులను గుర్తించామని, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు.