ఆర్కే నగర్ లో పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ ప్రశాతంగా పోలింగ్ జరుగుతోంది. మొత్తం 256పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. గుర్తింపు కార్డు ఉంటేనే ఓటర్లను పోలింగ్ కేంద్రానికి అనుమతిస్తున్నారు. ఫ్లయింగ్ స్వ్కాడ్ లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. దాదాపు సంవత్సరకాలం పాటు ఆర్కే నగర్ లో ప్రచారం జరిగింది. దేశంలో ఏ ఎన్నికకూ ఇంత సమయం ప్రచారం జరగలేదు. ఒకసారి ఎన్నిక వాయిదా పడటంతో దాదాపు ఏడాది నుంచి అభ్యర్థులు ఇక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ తెలుగు ఓటర్లు దాదాపు 60 శాతానికి పైగానే ఉన్నారు. ఉదయం 7.30గంటల నుంచే పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. దాదాపు ఐదు వేల మంది పోలీసులను ఏర్పాటు చేశారు. 2016లో ఆర్కే నగర్ లో 80 శాతానికి పైగానే పోలింగ్ జరిగింది. ఈసారి కూడా అంతకు మించి జరుగుతుందంటున్నారు.