ఉభయ సభలూ వాయిదా....కారణం ఏపీనే

Update: 2018-03-06 05:49 GMT

పార్లమెంటు ఉభయ సభల్లో ఏపీ హీట్ కొనసాగుతూనే ఉంది. ఉభయ సభలూ ప్రారంభమైన వెంటనే రెండు సభల్లోనూ టీడీపీ, వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ వారు నినదించారు. లోక్ సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు ఏపీ విభజన హామీలు అమలు చేయాలంటూ నినాదాలు చేయగా, టీఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్ల విషయంలో అధికారాన్ని రాష్ట్రాలకు బదలాయించాలంటూ నినాదాలు చేశారు. దీంతో లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. ఇటు రాజ్యసభలోనే ఇదే పరిస్థితి ఉండటంతో ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానం మనల్ని మనం అవమానుపర్చుకునేలా ఉందని అన్నారు. రాజ్యసభను ఉదయం 11.30గంటలకు వాయిదావేశారు. తన ఛాంబర్ లో కలవాలని ఆందోళన చేస్తున్న ఎంపీలను వెంకయ్య కోరారు.

Similar News