ఇది మరో హెరాస్ మెంట్ కధా చిత్రం.. కాకపొతే ఇది చిన్న సినిమా విచిత్రం...ష్టార్ట్ ఫిల్మ్ లలో కుడా అమ్మాయిలకు వేధింపుల జాడ్యం తప్పడంలేదు....హారిక కు తన షార్ట్ ఫిల్మ్ లో నటించిన తరువాత 10 వేలు ఇస్తానిని చెప్పి ఇవ్వకుండా ..వేధించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది హారిక ...వెంటనే స్పందించిన షీ టీం హారికను వేదిస్తున్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని పిలిపించి విచారించే విషయం వివాదం షరా మాములుగా సెల్ఫీ వీడియోల గోల ...ఎట్టకేలకు పోలీసులు ఐదురోజుల తరువాత అరెస్ట్ చేసి రిమండు కు తరలించారు ..ఈ మద్యలో జరిగింది " హెరాస్ మెంట్ కధా చిత్రం " ఓ షార్ట్ ఫిల్మ్ లా మారిపొయింది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి, హీరోయిన్ హారికల మధ్య 10 వేల వ్యవహారం గొడవకు దారి తీసింది.
వరుసగా విడుదల చేస్తున్న యోగి, హారిక...
హారిక ఫిర్యాదు తో షీటీం స్పందించింది .. యోగిని తేసుకు వచ్చి విచారించే క్రమంలో అడిషినల్ డిసీపి గంగిరెడ్డి వ్యవహరించిన తీరు వివాదంగా మారింది ... ఈ వీడియో మీడియాలో వైరల్ కావడం తో అయన పై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకున్నారు. కాని ఈ వీడియో తీసింది హారికనే అనేది యోగి ఆరోపణ. ఆ వీడీయో మీరు చూడండీ తన పై పోలీసు అదికారి దాడీ చేయడం పై ఓ సెల్ఫీ వీడియోలో యోగి వాపోయాడు. నిజా నిజాలు తెలుసు కోకుండా పోలీసులు తనపై దాడీ చేశారని ఆ సెల్ఫీ వీడియోలో తన భాదను వ్యక్తం చేసారు. యోగి తనను ఏ విధంగా హెరాస్ చేసాడో హారిక మీడియా ముందు తెలిపింది. తనలాంటీ వారు అతని చేతిలో మోసపోకుడదనే ఇలా కేసు పెట్టాల్సి వచ్చిందని, ఇలాంటి వారిని వదల కూడాదిని హెచ్చరించింది. అయితే హారిక మంచిది కాదని తనకు ఈ లైఫ్ బాగోలేదని తనకు జాలీ లైఫ్ కావాలని కోరుకుంటుంది అని యోగి తెలిపాడు .... హరిక మంచి అమ్మాయి అని చెప్పుకోవడం వల్ల తనకు ఒరిగిందేమీ లేదని ....మంచి గా కేరింగా చూసుకొనే బాయ్ ఫ్రెండ్ కావాలని యోగితో పర్సనల్ గా చాట్ చేసిన చాట్ హిస్టరీని మీడియాకు లీక్ చేసాడు యోగి. ఇంకేముంది కధ మళ్లీ మొదటికి వచ్చింది. హారికను ఈ విషయం పై వివరన కోరినప్పుడు హారిక తన వర్షన్ మొత్తాన్ని సెల్ఫీ వీడియో తీసి మీడియా కు పంపింది .. తనలా ఎవరూ భాద పడకుడదనే కేసు పెట్టానని, యోగి పై ఇప్పటికే మూడు కేసులు నమోదు అయ్యాయని, .డిసిపి వీడీయో తీసానని ఇగోకు పోయి తన మీద లేని పోని ఆరోపణలు చేస్తున్నాడు ఆ సెల్ఫీ వీడియోలో తెలిపింది.