అమ్మ టెన్షన్ : వారసుడు పన్నీర్ సెల్వమే!

Update: 2016-12-05 10:18 GMT

తమిళనాడులో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అమ్మ జయలలిత ఆరోగ్యం గురించి ఆస్పత్రి అధికారికంగా చేసే ప్రకటనలకు, వారు పెట్టె ట్వీట్ లకు మధ్య వైరుధ్యం జనంలో టెన్షన్ పెంచుతోంది. అపోలో ఆస్పత్రి బయట ఏడుపులు పెడబొబ్బలు మిన్నంటుతున్నాయి. ఇలాంటి నేపధ్యంలో రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయి. ప్రస్తుత ఇన్చార్జి సీఎం పన్నీర్ సెల్వం అధికారికంగా అమ్మ వారసుడిగా ఎంపిక అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

అన్నా డీఎంకే కు చెందిన ఎమ్మెల్యేలు అందరినీ పన్నీర్ సెల్వం ను వారసుడిగా ఎన్నుకునే డిక్లరేషన్ పై సంతకం చేయడానికి అపోలో ఆస్పత్రి వద్దకు రావాల్సిందిగా సమాచారం పంపారు. గవర్నర్ విద్యాసాగర్ రావు అపోలో కు చేరుకుంటున్నారు.

ఆమెను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. లండన్ నుంచి వచ్చిన డాక్టర్ బాలే కూడా చెన్నై లో ఒక ప్రకటన చేస్తూ, ఇది తమిళ ప్రజలకు, ఆమె అభిమానులకు కష్టకాలం ఆని పేర్కొనడం ప్రజల భయాన్ని మరింత పెంచుతోంది.

Similar News