ఈ నెల 30వ తేదీన విశాఖలో నిర్వహించనున్న వంచన దీక్షకు వైసీపీ శ్రేణులు అందరూ తరలి రావాలని ఆ పారీ పిలుపునిచ్చింది. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి చేసిన మోసాన్ని నిరసిస్తూ విశాఖలో వచ్చే సోమవారం నిరసన దీక్ష వైసీపీ తలపెట్టింది. ఈ వంచనదీక్షలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులంతా పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ నిరసనదీక్షను అందరూ కొనసాగించాలని జగన్ కోరారు. నిరసనదీక్షలో పాల్గొనేవారంతా నల్ల చొక్కాలు ధరించి సభా ప్రాంగణానికి రావాల్సిందిగా ఆ పార్టీ కోరింది. ఈ నెల 29వ తేదీ సాయంత్రానికి విశాఖకు చేరుకోవాలని, ఉదయాన్నే సభా ప్రాంగణానికి రావాలని ఆ పార్టీ నేతలను ఆదేశించింది.