Ys Sharmila: వైఎస్ షర్మిల వల్ల కాంగ్రెస్ బలోపేతం కాదా?
వైఎస్ షర్మిల కాంగ్రెస్ ను వీడిపోయిన క్యాడర్ ను తిరిగి రప్పించుకునే ప్రయత్నం చేయాలి
కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఏం చేయాలి? ముందు పార్టీని బలోపేతం చేయాలి? కాంగ్రెస్ ను తిరిగి రాష్ట్రంలో నిలబెట్టాలంటే అందుకు తగిన ప్రణాళికలను రచించాలి. ముందుగా కాంగ్రెస్ ను వీడిపోయిన క్యాడర్ ను తిరిగి రప్పించుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం తన నాయకత్వంపై నమ్మకం కలిగించాలి. వైఎస్ రాజశేఖ్ రెడ్డి కుమార్తెగా తాను ఏంటో నిరూపించుకోవాలంటే కేవలం జగన్ పై విమర్శలు చేస్తే సరిపోదు. వెళ్లిన క్యాడర్ తిరిగి రాదు. ముందుగా పార్టీని బలోపేతం చేయాలంటే ఓటు బ్యాంకును కూడా సుస్థిర పర్చుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలోనూ సొంత పార్టీ పెట్టి చేతులు కాల్చుకుని తిరిగి ఏపీలోనూ అదే తరహా వ్యవహరిస్తుండటాన్ని కొందరు పార్టీ నేతలే తప్పుపడుతున్నారు.
ఏళ్లు గడుస్తున్నా...
వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా ఎంపికయి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ అలాంటి ప్రయత్నాలు చేయకపోవడాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. జగన్ పై విమర్శలు చేయడం, వ్యక్తిగత వివాదాలను తరచూ ప్రస్తావిస్తుండటం, వివేకాహత్య విషయంలో షర్మిల చేస్తున్నవ్యాఖ్యలు ఆమెను రాజకీయంగా మరింత దిగజారుస్తున్నాయంటున్నారు.ఉదయం లేచిన దగ్గర నుంచి జగన్ పై పడకుండా, పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. పీసీసీ చీఫ్ గా వచ్చింది కేవలం జగన్ ను విమర్శించడానికే అన్న అభిప్రాయం జనంలో కలుగుతుంది. అదిరానున్న కాలంలో పార్టీతో పాటు వైఎస్ షర్మిలకు కూడా నష్టమే.
న్యాయపరంగా చూసుకోవాలే తప్పించి...
ఆస్తుల వివాదం ఉంటే న్యాయపరంగా చూసుకోవచ్చు. అంతే తప్ప రాజకీయంగా పద పదే ప్రస్తావిస్తే మాత్రం అది జగన్ కు ఎంత నష్టం చేకూరుస్తుందో.. అంతే నష్టం షర్మిలకు కూడా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా డ్యామేజీ కంట్రోల్ చేయడానికే వైఎస్ షర్మిల వస్తున్నారని ఇప్పటికే పెద్దయెత్తున వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవాలు, ఉన్నా లేకపోయినప్పటికీ ముందు జగన్ మీద ఆరోపణలుమానేసి పార్టీ బలోపేతం పై ఫోకస్ పెడితే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కనీసం రెండు మూడు సీట్లలోనైనా గెలిచే అవకాశముందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.