Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభృద్ధిలో నేడు అతి పెద్ద పెట్టుబడి

ఉక్కు రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి పెద్ద పెట్టుబడి రానుంది

Update: 2026-03-23 02:31 GMT

ఉక్కు రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి పెద్ద పెట్టుబడి రానుంది. 1.36 లక్షల కోట్లరూపాయాల పెట్టుబడితో రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరుగుతుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు నేడు భూమి పూజ జరగనుంది. కేంద్ర మంత్రులతో కలిసి ప్లాంటుకు నేడు శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు చేయనున్నారు.ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. లక్ష మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

లక్ష మందికి ఉపాధి...
గ్రీన్‌ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ రెండు దశల్లో సాకారం కానుందని మిట్టల్ సంస్థ తెలిపింది. అనుబంధంగా రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ మరో 6 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో పరిశ్రమల హబ్‌గా విశాఖ ఎకనమిక్ రీజియన్గా మారనుంది. జాతీయ, అంతర్జాతీయ ఉక్కు మార్కెట్‌లో ఏఎంఎన్ఎస్ ఇండియా భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించనుంది. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని విధాలా సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలు సహాయాన్ని అందిస్తుంది. స్టీల్ ప్లాంట్‌ను ఎన్‌హెచ్-16తో కలిపేలా శరవేగంగా 4 లేన్‌ రహదారి విస్తరణ పనులు చేపట్టింది.
నేడు శంకుస్థాపన...
నేడు జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వ ప్రముఖులతో పాటు ఉక్కు సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం నేరుగా నక్కపల్లి మండలం రాజయ్యపేటకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ఎక్స్‌పీరియన్స్ జోన్ సందర్శన, ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ మోడల్‌ పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన ఫలకాన్ని చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. భూమిపూజకు ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నారాయణ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రతినిధులు హాజరు కానున్నారు.


Tags:    

Similar News