మరో పథకానికి నేడు జగన్ శ్రీకారం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రతిష్టాత్మక పధకాన్ని నేడు ప్రారంభించనున్నారు. జగనన్న విద్యాపథకాన్ని జగన్ ఈరోజు ప్రారంభించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో [more]

Update: 2020-10-08 02:10 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రతిష్టాత్మక పధకాన్ని నేడు ప్రారంభించనున్నారు. జగనన్న విద్యాపథకాన్ని జగన్ ఈరోజు ప్రారంభించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదవే విద్యార్థినీ, విద్యార్థులకు స్కూల్ కిట్స్ ను అందించే కార్యక్రమానికి జగన్ నేడు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు 42.34 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం అందుతుంది. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్ లు, షూలు, యూనిఫాంలను విద్యార్థులకు అందించే ఈ పథకాన్ని నేడు జగన్ ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News