బ్రేకింగ్ : ప్రత్యేక హోదాపై జగన్ లేటెస్ట్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎప్పటికైనా వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన ఈరోజు పరిశ్రమల అంశంపై అధికారులు, నిపుణులతో చర్చించారు. ప్రత్యేక హోదా వచ్చి [more]

Update: 2020-05-28 07:00 GMT

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎప్పటికైనా వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన ఈరోజు పరిశ్రమల అంశంపై అధికారులు, నిపుణులతో చర్చించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పరిశ్రమలకు పెద్దయెత్తున రాయితీలు వచ్చే వన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ రాదని అనుకున్నామని, కానీ తాము ఊహించని విధంగా కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదన్నారు. కానీ అలా అని ఊరుకోమని జగన్ అన్నారు. ప్రత్యేక హోదా విషయం వీలయినప్పుడల్లా ప్రస్తావిస్తూనే ఉంటామని చెప్పారు. కానీ ఏదో ఒకరోజు కేంద్ర ప్రభుత్వం మనపై ఆధారపడాల్సి వస్తుందని, అప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదాను సాధించుకుంటామని జగన్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా నినాదాన్ని విడిచిపెట్టనని చెప్పారు.

Tags:    

Similar News