బ్రేకింగ్ : పోతిరెడ్డి పాడుపై జగన్ స్పందన ఇదే

పోతిరెడ్డి ప్రాజెక్టు పరిధి పెంపు పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. రాయలసీమతో సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు నీటి కొరత ఉందన్నారు. కృష్ణా నీటి [more]

Update: 2020-05-12 14:27 GMT

పోతిరెడ్డి ప్రాజెక్టు పరిధి పెంపు పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. రాయలసీమతో సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు నీటి కొరత ఉందన్నారు. కృష్ణా నీటి బోర్డు ఎప్పటికప్పుడు నీటి తరలింపును పర్యవేక్షిస్తుందని చెప్పారు. కృష్ణా నదిలో నీటిమట్టం 881 అడుగులు ఉన్నప్పుడే పోతిరెడ్డి పాడు నుంచి నీటి సరఫరా సాధ్యమవుతుందన్నారు. ఆస్థాయి నీటిమట్టం కేవలం పదిరోజులు మాత్రమే ఉంటుందన్నారు. ఆ పదిరోజుల్లోనే నీటిని తరలించాల్సి ఉంటుందన్నారు. ఏపీ వాటా ప్రకారమే పోతిరెడ్డి పాడు పరిధిని పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చామన్నారు. ఏపీకి కేటాయించిన నీటిని మాత్రమే ఏపీని వాడుకుంటామన్నారు. పరిధి దాటి నీటిని వినియోగిస్తే కృష్ణా రివర్ బోర్డు అంగీకరించదన్నారు. శ్రీశైలంలోకి నీళ్లు రాకముందే తెలంగాణ నీళ్లు ఎలా తీసుగలుగుతోంది అని ప్రశ్నించారు. కేటాయింపులు దాటి ఏ రాష్ట్రమూ నీటిని వాడుకోలేదన్నారు. ఏపీ హక్కుగా కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని చెప్పారు.

Tags:    

Similar News