వారికి జగన్ లేఖ.. నేనున్నానంటూ భరోసా

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డ్వాక్రా మహిళలకు లేఖ రాశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రుణాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ వారు చెల్లించాల్సిన [more]

Update: 2020-04-22 07:24 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డ్వాక్రా మహిళలకు లేఖ రాశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రుణాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ వారు చెల్లించాల్సిన వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని లేఖలో తెలిపారు. మొత్తం ఏపీ వ్యాప్తంగా 90 లక్షల మందికి దీని ద్వారా లబ్ది చేకూరనుంది. ఈ నెల 24వ తేదీన అందరి బ్యాంకు ఖాతాల్లో 1,400 కోట్ల రూపాయలను జమ చేస్తున్నట్లు జగన్ లేఖలో తెలిపారు. ఎలాంటి అధైర్యం వద్దని, అండగా తానున్నానని జగన్ డ్వాక్రా మహిళలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News