ఆ నష్టమెంత? వెంటనే పరిహారం ఇవ్వండి… జగన్ ఆదేశం

ఏపీ ముఖ్యమంత్రి వైైఎస్ జగన్ వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు. పంట నష్టం, పరిహారంపై ఆయన అధికారులతో సమావేశమై చర్చించారు. వెంటనే అకాల వర్షాలకు ఎంత పంట నష్టం [more]

Update: 2020-04-10 06:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైైఎస్ జగన్ వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు. పంట నష్టం, పరిహారంపై ఆయన అధికారులతో సమావేశమై చర్చించారు. వెంటనే అకాల వర్షాలకు ఎంత పంట నష్టం జరిగిందన్న వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వెంటనే పరిహారాన్ని అందించేలా కూడా ఏర్పాటు చేయాలని కోరారు. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే పంట దిగుబడి వచ్చినా మార్కెట్ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి కొన్ని చోట్ల కొనుగోలు చేస్తున్నా కూలీలు లేక పంటలను మార్కెట్ కు తరలించలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో అకాల వర్షం రైతులకు శాపంగా మారింది. వెంటనే పంట నష్టం నమోదు చేసి పరిహారాన్ని అందచేయాలని జగన్ ఆదేశించారు.

Tags:    

Similar News