ఇక వాటిపై దృష్టి పెట్టండి… కఠిన నిర్ణయాలు తీసుకోండి

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. హాట్ స్పాట్ లలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా పాజిటివ్ నమోదయిన వారు ఉన్న చోట కిలోమీటరు వరకూ [more]

Update: 2020-04-06 06:55 GMT

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. హాట్ స్పాట్ లలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా పాజిటివ్ నమోదయిన వారు ఉన్న చోట కిలోమీటరు వరకూ రాకపోకలను నిషేధించింది. ఆ ప్రాంతంలో ర్యాపిడ్ సర్వేను, టెస్టులను నిర్వహించాలని నిర్ణయించింది. పన్నెండు గంటల్లోనే 14 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రధానంగా హాట్ స్పాట్ లపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. జగన్ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ను మరింత కఠిన తరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఏపీలో 266 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News