తెలంగాణానే ఇలా ఉంటే ఏపీ మరి?

కరోనా వైరస్ ప్రభావం ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపుతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ నెలలో 12 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. దీంతో [more]

Update: 2020-03-31 02:55 GMT

కరోనా వైరస్ ప్రభావం ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపుతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ నెలలో 12 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. దీంతో ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడానికి సిద్ధమయ్యారు కేసీఆర్. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జీతాల్లో 60 శాతం, మిగిలిన అధికారుల వేతనాల్లో 50 శాతం కోత విధించాలని నిర్ణయించారు. నాల్గోతరగతి ఉద్యోగుల వేతనాల్లో పది శాతం, పెన్షనర్ల కు చెల్లింపుల్లో యాభై శాతం కోత విధించనున్నారు. ఆర్థికంగా బలమైన రాష్ట్రం తెలంగాణయే ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తే, ఏపీలో జగన్ పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. ఈరోజు 31వ తేదీ కావడంతో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి.

Tags:    

Similar News